భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం
గద్వాల జిల్లాలోని శాంతినగర్‌లో పల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామాలు, భక్తి గీతాలు ఆలపించి దేశభక్తిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాణిక్యం వెంకటేశ్, కోడి వెంకటేశ్, లెక్చరర్ శ్రీకాంత్, కాసిం గౌడ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.