'పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం'
BDK: చుంచుపల్లి మండలం ధనాబాద్ పంచాయతీ మాయాబజార్‌లో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి జ్యోతిని గెలిపించాలని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నేడు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చారా అని స్థానికులను అడిగారు. అన్ని పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలం అయిందని వారు ఎద్దేవా చేశారు.