గోదావరి పుష్కరాలపై అధికారులతో సమీక్ష సమావేశం
E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ గురువారం సాయంత్రం ఆయన కార్యాలయంలో రాబోయే 2027 గోదావరి పుష్కరాలు దృష్ట్యా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సంక్రాంతి పండగ నాటికి నియోజకవర్గం రోడ్డు పనులు, మంచి నీటి సరఫరా పనులు పూర్తి చేయాలన్నారు.