జర్మనీలో ఉద్యోగాలకు 30 మంది ఎంపిక

జర్మనీలో ఉద్యోగాలకు 30 మంది ఎంపిక

VZM: స్థానిక గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. మొత్తం 80 మంది అభ్యర్థులు హాజరు కాగా.. అందులో 30 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారికి 4 నెలల జర్మన్ భాష శిక్షణ ఇచ్చి, అనంతరం జర్మనీలో ఉద్యోగాలు కల్పించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి. ప్రశాంత్ కుమార్ తెలిపారు.