వినాయక చవితి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు

SKLM: మబుగాం గ్రామంలో బుధవారం జరిగిన వినాయక ఉత్సవాల్లో నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. పెద్ద వీధిలో యువకులు ఏర్పాటుచేసిన ఈ ఉత్సవాల్లో ఆయన పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రజలు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని కోరారు.