బస్ డిపో ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి
SDPT: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద బస్ డిపో ఏర్పాటు చేయాలని సిద్ధిపేటకు చెందిన యోగా ట్రైనర్, సామాజిక కార్యకర్త మనోహర్ మంత్రి కొండా సురేఖను కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బస్ డిపో లేకపోవడం వల్ల భక్తులు ఆలయానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.