VIDEO: 'జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి'
MBNR: జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు జగదీశ్, అడ్వకేట్ డా. శ్రీకాంత్ బృందం సోమవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో గళం విప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.