HIV బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేత
VZM: విజయనగరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో HIV బాధిత చిన్నారులకు సుమారు రూ.11వేలు విలువ చేసే న్యూట్రిషన్ ఫుడ్‌ను అడిషనల్ DMHO రాణి, దాత మంజుల చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ప్రభుత్వం పౌష్టికాహారం అందించే దిశగా కృషి చేసి వారందరికీ మేమున్నామనే మనో ధైర్యం కల్గించాలని ఆమె తెలియజేశారు.