కేతావారిదిబ్బలో క్షుద్రపూజల కలకలం

కేతావారిదిబ్బలో క్షుద్రపూజల కలకలం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలంలోని సవరపాలెం కేతావారిదిబ్బలో సోమవారం క్షుద్రపూజల కలకలం రేపింది. 20 బీసీ కుటుంబాలను భయపెట్టేలా ఆకతాయిలు నిమ్మకాయలు, దిష్టిబొమ్మలు, పసుపు కుంకుమలతో ముగ్గులు వేశారు. స్థానికుల ఫిర్యాదుతో ఎస్సై శేఖర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ ముగ్గులను తొలగింపజేసి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు.