గన్నవరంలో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

గన్నవరంలో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్‌లో నూతనంగా నిర్మిస్తున్న డివైడర్, రహదారి మరమ్మతు పనులను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులకు తగిన సూచనలు అందించారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.