నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత: కలెక్టర్

నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత: కలెక్టర్

గద్వాల చేనేత జరీ చీరల ఖ్యాతిని కాపాడుతూ, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజావాణిలో చేనేత స్టాల్స్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నేతన్న భరోసా, రుణమాఫీ, భీమా పథకాల కింద అర్హులైన కార్మికులకు ప్రభుత్వం తరఫున చెక్కులను పంపిణీ చేసి, సంప్రదాయ నేత వృత్తికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.