'మహాత్మా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి'

'మహాత్మా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి'

మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బహుజన నాయకులు కోరారు. పూలే వర్ధంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన బహుజన సమ్మేళనంలో వారు మాట్లాడారు. సమాజంలో మెజార్టీ వర్గాల న్యాయమైన హక్కుల కోసం సామాజిక న్యాయ పోరాటాన్ని కొనసాగించిన ఫూలే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.