'మైనర్లు వాహనాలు నడపడం నేరం'
VZM: పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో మైనర్లు, వారి తల్లిదండ్రులకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టపరమైన నేరమని, తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భాస్కర్ పాల్గొన్నారు.