లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
NGKL: కార్మిక హక్కుల కు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అచ్చంపేట పట్టణంలో ఇవాళ జరిగిన సీఐటీయూ మండల మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులు, కర్షకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.