భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీపీ

భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీపీ

వరంగల్ జిల్లాలోని చారిత్రక భద్రకాళి దేవాలయాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారికి పోలీస్ కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పోలీస్ కమిషనర్కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ గోపి, ఎస్సై దివ్య తదితరులు పాల్గొన్నారు.