ఫోన్ పే యాప్‌తో మోసం.. వ్యక్తి అరెస్ట్
సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో చిరువ్యాపారులను నకిలీ ఫోన్ పే యాప్‌తో మోసగిస్తున్న ఏపీకి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్ నగర్ పట్టణంలోని గాంధీ పార్క్ సెంటర్ వద్ద డబ్బులు కావాలని, ఫోన్ పే చేస్తానని నమ్మించే ప్రయత్నం చేయగా.. అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకున్నారు. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.