ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి
HYD: ఫ్యూచర్ సిటీ నిర్మాణాల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ కార్యాలయం నిర్మాణ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ కార్యాలయం త్వరగా పూర్తి చేయాలని అక్కడి సిబ్బందికి ఆదేశించారు.