ఓదివీడులో ప్రజా దర్బార్
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వీరబల్లి(మం) ఓదివీడులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యల్లో సుమారు 80 శాతం అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు.