'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
KNR: హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ గ్రామంలో గురువారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అలీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుత కొత్త కొత్త విధానాల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.