ఆశా వర్కర్ల సమ్మెకు మద్దతు: మాజీ MLA
NZB: ఆశా వర్కర్ల సమ్మెకు NZB అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల మద్దతు తెలిపి మాట్లాడారు. ఆశా వర్కర్లు చేస్తున్న న్యాయమైన సమ్మెకు పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.18వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు పిలుపునిచ్చే ప్రతి ఆందోళనలో పాల్గొని ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.