ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

PPM: లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు మళ్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలో గల సౌందర్య థియేటర్ వెనుక శత్రుచర్ల రియల్ ఎస్టేట్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ ప్రాంతన్ని పరిశీలించారు