ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి

అనంతపురం: ప్రతి ఒక్కరూ ఓటు హక్కుల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ కోరారు. రాయదుర్గం పట్టణంలో మంగళవారం ఓటు హక్కు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఆయన పాల్గొని ఓటు హక్కు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా సరైన ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.