గంజాయి హాట్ స్పాట్లపై దృష్టి సారించాం: SP
BDK: కొత్తగూడెంలో జరిగిన చైతన్యం డ్రగ్స్‌పై యుద్ధం ముగింపు సభలో ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం మాట్లాడారు. జిల్లాలో గంజాయి నివారణ కోసం భద్రాద్రి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. గంజాయిపై యుద్ధం ఇది ఆరంభం మాత్రమే అని, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే అనుమానితులు, గంజాయి హాట్ స్పాట్లపై దృష్టి సాధించామని తెలిపారు.