నిమజ్జనానికి డీజేలు నిషేధం: ఎస్సై

KMR: కామారెడ్డిలో ఓ ఫౌండేషన్ సభ్యులు మంగళవారం మట్టి వినాయకులను టోకెన్ల ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీబీపేట్ ఎస్సై ప్రభాకర్ మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలకు డీజేలను నిషేధించి, సంప్రదాయబద్ధంగా డప్పు చప్పులతో వినాయక నిమజ్జనాన్ని వైభవంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుతార్ రమేష్, పాల్గొన్నారు.