VIDEO: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శాఖల సంఘం
కామారెడ్డి పరిధిలోని 15 బస్తీలలోని 20 శాఖల నుంచి 523 మంది పాల్గొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శాఖల సంగమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం వ్యాయామం ఆటలు సూర్య నమస్కారాలు చేశారు. RSS 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శాఖల సంగమం ద్వారా క్రమశిక్షణను ప్రస్ఫుటం చేస్తూ, హిందూ జాగరుకత, సేవా పనితీరును సమాజానికి పంచాలని పిలుపునిచ్చారు.