ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా HPV వ్యాక్సిన్ పంపిణీ

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా HPV వ్యాక్సిన్ పంపిణీ

బాపట్ల: మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సంతమాగులూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2011వ సంవత్సరంలో జన్మించిన బాలికలందరికీ హెచ్.పి.వి (HPV) వ్యాక్సిన్‌ను ఉచితంగా వేయనున్నట్లు ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. చిన్న వయసులోనే ఈ వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షణ పొందుతారన్నారు.