పాక్‌కు మద్దతు.. ఆ దేశాలకు బుకింగ్‌లు బంద్!

పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా 'ఆపరేషన్ సింధూర్'తో భారత్ దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పాక్‌కు మద్దతుగా నిలుస్తున్న టర్కీ, అజర్‌బైజాన్, ఉజ్బెకిస్థాన్‌లకు నూతన బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.