ప్రభుత్వ సొమ్ము దొంగలపాలు
KNR: కొన్ని గ్రామాలలో చెత్త సేకరణకు కేటాయించిన ట్రాక్టర్‌లను నిరుపయోగంగా మూలకు పడేస్తున్నారు. గంగాధర మండలం ఒద్యారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి కేటాయించిన ట్రాక్టర్‌ను ఉపయోగించకపోవడంతో అందులోని బ్యాటరీ, రేడియేటర్, హైడ్రాలిక్, డ్రాబర్ పట్టీలు, ఇంజన్‌లోని పలు భాగాలతోపాటు టైర్లు దొంగలించారు. దీంతో గ్రామంలో చెత్త సేకరణ ఆగిపోయిందని గ్రామస్తులు వాపోతున్నారు.