VIDEO: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన పుంగనూరు CI

CTR: పుంగనూరు పట్టణంలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను శనివారం CI శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు. జిరాక్స్ సెంటర్‌లను మూసి వేయించినట్లు పేర్కొన్నారు. 100 మీటర్ల లోపు ఇతరులు ఎవరూ ఉండరాదని CI హెచ్చరించారు.