ఇంటి స్థలం చూపించాలంటూ తహసీల్దార్‌కి వినతిపత్రం

KKD: సామర్లకోట పట్టణ పరిధి బలుసులు పేటకు చెందిన సుమారు 120 మందికి గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఇంటి స్థలం చూపించడం లేదని 13వ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు ఆరోపించారు. మంగళవారం తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని ఇళ్ల స్థలాల లబ్ధిదారులు కలిసి సమస్యపై వినతిపత్రాన్ని అందజేశారు.