పది విద్యార్థులకు పండ్ల పంపిణీ
ASF: దహేగాం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మాజీ MLA కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు అరటిపండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులందరికీ 'ఆల్ ది బెస్ట్' తెలిపారు.