ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య

KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ముద్దసాని కనకయ్య (46) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఆయన, చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు సోమవారం చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.