'ప్రతి ఒక్కరూ మట్టి గణపతి, విత్తన గణపతిని పూజించాలి'

PDPL: ప్రతి ఒక్కరూ మట్టి గణపతి, విత్తన గణపతిని పూజించే పర్యావరణాన్ని కాపాడాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీపీసీలో హరిత సేన బాధ్యులు విత్తన గణపతులను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గం కాలుష్య రహితంగా ఉండాలని పిలుపునిచ్చారు.