పారిశుధ్య పరిరక్షణతో ప్రజారోగ్యం సాధ్యం

పారిశుధ్య పరిరక్షణతో ప్రజారోగ్యం సాధ్యం

ASR: గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతోనే ప్రజారోగ్యం సాధ్యమని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు అన్నారు. శానిటేషన్ డ్రైవ్లో భాగంగా డిప్యూటీ ఎంపీడీవో బాబూరావుతో కలిసి శుక్రవారం రావణాపల్లిలో క్లీన్ విలేజ్-గ్రీన్ విలేజ్ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ, సచివాలయ సిబ్బంది, క్లాప్ మిత్రలతో కలిసి నాలుగు వీధుల్లో పారిశుధ్య పనులు, చెత్త తొలగింపు పనులు చేపట్టారు.