ప్రపంచ దేశాలకూ ముప్పు..
అమెరికా సైన్యంపై చైనా ఏఐ నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా ప్రైవేట్ రంగ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యం మరింత పెంచుకోవడంతో ప్రపంచ దేశాలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు కొంతమంది నిపుణులకే పరిమితమైందని అన్నారు. కానీ, ఏఐ రాకతో ప్రభుత్వాలకు మాత్రమే లభించే అంతర్గత సమాచారం ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకూ అందుబాటులోకి వస్తోందన్నారు.