చర్మ సౌందర్యంలో కాఫీ పొడి కీలకపాత్ర!

చర్మ సౌందర్యంలో కాఫీ పొడి కీలకపాత్ర!

కాఫీ పొడిని స్క్రబ్‌లా వాడటం వల్ల చర్మంపై జిడ్డు తొలగిపోయి మెరుస్తుంది. స్నానం చేసే సమయంలో కాఫీపొడిని నూనె లేదా జెల్‌తో కలిపి చర్మంపై రుద్దాలి. లేదా రెండు కప్పుల కాఫీ గింజలు, ఒక కప్పు నీళ్లు, కొన్ని చుక్కుల టీట్రీ నూనెను బ్లెండర్‌తో బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపటికి చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మంపై పేరుకున్న జిడ్డు తొలగిపోతుంది.