'బాబు జగ్జీవన్ రావ్ స్ఫూర్తితో ఉద్యమించాలి'
MGL: దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ అని MRPS రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ అన్నారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయం కోసం యువత బాబు జగ్జీవన్ రావ్ స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు.