పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి

NRML: విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలని బాసర మండల MEO.G.మైసాజి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో USA పౌరుల ఆర్థిక సాయంతో నిర్వహించబడుతున్న రూమ్ టు రీడ్ ఇండియా స్పాన్సర్షిప్ ద్వారా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో మోడల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేశారన్నారు.