రక్షణ శాఖ అధికారుల కీలక ప్రెస్ మీట్

భారత రక్షణ శాఖ అధికారులు ఉదయం 11 గంటలకు కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత చోటుచేసుకున్న తాజా పరిణామాలపై వారు వివరణ ఇవ్వనున్నారు. అలాగే, పాక్ వైపు నుంచి చోటుచేసుకున్న ఉల్లంఘన గురించి తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా, పాక్ కాల్పులకు భారత భద్రతా బలగాలు ఎలా స్పందిస్తున్నాయనే విషయాలపై స్పష్టత ఇవ్వనున్నారు.