తంటికొండ వద్ద రోడ్డు ప్రమాదం
ASR: రాజవొమ్మంగి మండలం తంటికొండ శివారు జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుంచి కొయ్యురు వెళ్తున్న ఇసుక లారీకి గేదె అడ్డురావడంతో, దాన్ని ఢీకొని లారీ బోల్తా పడింది. ఈ ప్రాంతంలో గేదెలు, పశువులు అడ్డురావడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.