పంట పొలంలో కలకలం రేపిన భారీ కొండచిలువ

పంట పొలంలో కలకలం రేపిన భారీ కొండచిలువ

ASF: బెజ్జూర్ మండలంలోని కుకిడ పంట పొలాల్లో శుక్రవారం భారీ కొండచిలువ కనిపించడంతో కూలీలు పరుగులు పెట్టారు. ఇట్టి విషయం పొలం యజమానికి తెలపడంతో అక్కడికి చేరుకొని భారీ కొండచిలువను పట్టుకునేందుకు కొంతమంది యువకులు వచ్చి పట్టుకొని బయట ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. పాములు, కొండచిలువలు వరి కుప్పలలో ఉండే ప్రమాదం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు.