పనిచేయని జలమండలి వాట్సాప్ సర్వీస్..?
HYD: జలమండలి పరిధిలో మంచినీటి, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సిటిజెన్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభించారు. కానీ అది ప్రస్తుతం పని చేయడం లేదని, ఫిర్యాదులు చేసిన ఎలాంటి జవాబు రావడంలేదని పలువురు హైదరాబాద్ నేటిజన్లు తెలిపారు. దీని పై ఉన్నతాధికారులు స్పందించి, వెంటనే సర్వీస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక చోట్ల సమస్యలు నెలకొన్నట్లు చెప్పారు.