VIDEO: కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
SKLM: నరసన్నపేట మండలం జడూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇవాళ టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు జడూరు వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వడ్డీతాండ్ర వాసి రెడ్డి శ్రీరాములుకు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన శ్రీరాములును 108 వాహనంలో నరసన్నపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.