నరసింహ స్వామిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

నరసింహ స్వామిని దర్శించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే

ATP: రాప్తాడు మండలంలోని జయలక్ష్మి పురం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ హాజరై ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.