గ్రామసభల్లో ప్రజలకు పోలీసుల అవగాహన
సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలను వివరించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.