వేలం.. రూ.20 లక్షలకు సర్పంచి పదవి
TG: సర్పంచ్ పదవి కోసం పలువురు నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల బహిరంగ వేలం వేస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగుగూడెం పంచాయతీ సర్పంచి పదవికి బహిరంగ వేలం వేశారు. వేలంలో ఏడుగురు అభ్యర్థులు పోటీపడగా.. ఒకరు రూ.20 లక్షలకు దక్కించుకున్నారు. కాగా, ఈ గ్రామంలో రెండో దశలో పోలింగ్ జరగనుంది.