'లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చాలి'
ATP: అనంతపురంలో మంత్రి నారా లోకేశ్‌ను ఏపీ వీరశైవ లింగాయత్, లింగ బలిజ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ తుల్జాపూర్ స్వప్న కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీరశైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన లింగాయత్ కమ్యూనిటీ సమస్యలను కూడా ఆమె మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.