'కానిస్టేబుల్ అభ్యర్థులు 23న హాజరు కావాలి'

GNTR: సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 23న ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద హాజరు కావాలని ఎస్పీ సతీష్ బుధవారం తెలిపారు. అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడు జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని హాజరుకావాలని సూచించారు.