నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అమర్నాథ్

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అమర్నాథ్

అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యఅతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్‌ కె.కన్నబాబు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందన్నారు.