గండికోటకు నిలచిన కృష్ణా జలాలు

KDP: నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి గండికోట ప్రాజెక్టుకు వస్తున్న కృష్ణా జలాలను నిలిపివేశారని జల వనరుల శాఖ ఈఈ ఉమామహేశ్వర్లు సోమవారం తెలిపారు. దీంతో మైలవరానికి పంపుతున్న జలాలను నిలుపుదల చేశామన్నారు. గండికోట ఎత్తిపోతల పథకం నుంచి CBRకు 1000 క్యూసెక్కుల నీరు పంపుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వలు 26.58 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు.